Health Tips: వీళ్లకు అంజీర్ వెరీ డేంజర్..!

Health Tips: అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషక నిపుణులు చెబుతుంటారు. విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉండటంతో సాధారణంగా ఇవి శరీరానికి శక్తినిచ్చే ఆహారంగా గుర్తింపు పొందాయి. అయితే, ప్రతి ఆహారం అందరికీ మేలు చేస్తుందన్న నియమం లేదు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అంజీర్ పండ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంజీర్ పండ్లలో సహజంగా చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా మధుమేహం ఉన్నవారు వీటిని అధికంగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అంజీర్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు...