పాత బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులను తీసుకోవడం ఎలా..?

బ్యాంక్ ఖాతాను కొన్నేళ్ల పాటు ఉపయోగించకుండా వదిలేస్తే అది ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అకౌంట్‌గా మారుతుంది. అలా మారిన తర్వాత ఖాతాదారుడు నేరుగా డబ్బులు తీసుకునే అవకాశం ఉండదు. చాలా మందికి ఈ విషయం తెలిసినా.. అకౌంట్ తిరిగి యాక్టివ్ చేసుకునే విధానం గురించి స్పష్టమైన అవగాహన ఉండదు. అలాగే ఖాతాదారుడు మరణించిన తర్వాత ఆ అకౌంట్‌లో ఉన్న డబ్బులను కుటుంబ సభ్యులు ఎలా పొందాలన్న విషయంపై కూడా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఒక స్పష్టమైన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పాతగా మారిపోయిన లేదా ఇనాక్టివ్ అయిన బ్యాంక్ ఖాతాలను గుర్తించి, అందులో ఉన్న డబ్బులను సులభంగా...