గద్దెకు చేరిన సారలమ్మ

వేలాదిగా తరలివచ్చిన భక్తులు సంప్రదాయ పూజలు.. పసుపు కుంకుమలతో ఆచారాలు పూజారి ఇంటి నుంచి గద్దె వరకు సారలమ్మ ఊరేగింపు డప్పు చప్పుళ్ల మధ్య శివసత్తుల పూనకాలు దర్శనానికి పోటెత్తిన భక్తులు 50 మంది వైద్య బృందంతో వైద్య సేవల విస్తరణ ఉచిత వైద్య శిబిరంతో సంరక్ష ఆసుపత్రి సేవలు శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా పోలీసుల అప్రమత్తత స్టార్ త్రినేత్రం, వరంగల్: మినీ మేడారంగా పేరుగాంచిన అగ్రంపాడు సమ్మక్క సారలమ్మ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. అడుగడుగునా భక్తుల జయజయధ్వానాలతో అగ్రంపాడు పరిసర ప్రాంతాలు మార్మోగిపోయాయి. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు తరలిరావడంతో జాతర ప్రాంగణం భక్తజన సందోహంగా మారింది. వనదేవతల ఆగమనంతో గ్రామం...