సమ్మక్క సారలమ్మ జాతరకు కేంద్రమంత్రి జుయల్ ఓరం
స్టార్ త్రినేత్రం, వరంగల్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సమ్మక్క సారలమ్మ మహాజాతరకు మరో ప్రత్యేక ఆకర్షణ జతకానుంది. గురువారం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం మేడారం జాతరలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. కేంద్ర మంత్రి హాజరు కావడం జాతరకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల హైదరాబాద్లోని కన్హా శాంతివనంలో నిర్వహించిన గిరిజన గ్రామీణ వైద్య సహకారుల సదస్సు సందర్భంగా ఈ ఆహ్వానం చోటుచేసుకుంది. ఆ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి జుయల్...