Politics: పార్టీ ఫిరాయింపుల అంశంలో ఎమ్మెల్యే దానం బిగ్ ట్విస్ట్

Politics: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు మొదలుపెట్టడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం అధికారికంగా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన ఎదుట విచారణకు హాజరుకావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసులు అందిన కొద్ది గంటల్లోనే దానం నాగేందర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని స్పీకర్‌కు స్పష్టంగా తెలియజేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత...