Election notification issueg: ‘జాతర సమయంలో ఎన్నికలేంటి..?’
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు ప్రతిపక్షాలకు శాపం.. అధికార పార్టీకి వరంగా మారిన షెడ్యూల్ గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ Election notification issueg: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. జనవరి 28 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవ్వగా, షెడ్యూల్ ప్రకటించిన మరుసటి రోజే నోటిఫికేషన్ జారీ చేయడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ ద్వారా ఎన్నికల సంఘంపై ఘాటు విమర్శలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలా.. లేక...