తెలంగాణ విపత్తు నిర్వహణపై ప్రభుత్వ దృష్టి

దేశానికి ఆదర్శంగా వ్యవస్థ తీర్చిదిద్దుతామన్న మంత్రి సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష ఆధునిక సాంకేతికత వినియోగానికి ప్రణాళిక మండల స్థాయి వరకు వాతావరణ కేంద్రాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్టార్ త్రినేతం, హైదరాబాద్: తెలంగాణలో విపత్తు నిర్వహణ వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. విపత్తులు సంభవించినప్పుడు స్పందించడమే కాకుండా, ముందే వాటిని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టే స్థాయికి వ్యవస్థను తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ దిశగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సచివాలయంలో ఫైర్...