KCR: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు బీఆర్ఎస్ హయాంలో గిరిజన సంస్కృతికి పెద్దపీట KCR: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ ఉత్సవాలు పురస్కరించుకుని మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ గడ్డ త్యాగానికి, ఆత్మగౌరవానికి, అన్యాయంపై ఎదిరించే ధిక్కారానికి ఆదివాసీ దేవతలు నిలువెత్తు నిదర్శనం అని ఆయన కొనియాడారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భావించే ఈ ఇలవేల్పులకు మొక్కులు చెల్లించుకోవడానికి దేశ నలుమూలల నుంచి కోట్లాదిగా తరలివచ్చి, మేడారం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మలచుతారు. ఈ జనసందోహం కుంభమేళా వాతావరణాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆధ్యాత్మిక అభివృద్ధిని...