TG Law CET 2026: టీజీ లాసెట్- 2026 నోటిఫికేషన్ విడుదల
TG Law CET 2026: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన లా ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. టీజీ లాసెట్-2026, టీజీ పీజీఎల్ సెట్-2026 నోటిఫికేషన్ను మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని వివిధ న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీతో పాటు రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది టీజీ లాసెట్, టీజీ పీజీఎల్ సెట్ పరీక్షల నిర్వహణ బాధ్యతను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. లా విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది కీలక అవకాశంగా మారనుంది. నోటిఫికేషన్...