Telangana: వివాహ రిజిస్ట్రేష‌న్ల కోసం మినీ మ్యారేజీ హాల్‌

Telangana: తెలంగాణ ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లుగా స్వార్థపూరిత నిర్ణయాలు, అవ్యవస్థ కారణంగా రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు, సూచనల మేరకు గత రెండేళ్లుగా వ్యవస్థను సరిదిద్దుతూ ప్రజలకు సేవలు చేరువ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. మంగళవారం సచివాలయంలో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ కార్యాలయాల ఏర్పాటుపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న 39 సబ్ రిజిస్ట్రార్...