Telangana: మోగిన పురపోరు నగారా
ఫిబ్రవరి 11న పోలింగ్ ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం జనవరి 28 నుంచి నామినేషన్ల...