Ponguleti Srinivasa Reddy: వర్ధన్నపేటలో రూ.294 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Ponguleti Srinivasa Reddy: పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నది ప్రజా ప్రభుత్వం అని రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో సోమవారం సుమారు రూ.294 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధిగా మలచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో టీయూఎఫ్ఐడీసీ తదితర నిధులతో రూ.20 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు, పార్కుల అభివృద్ధి...