T20 World Cup 2026: ప్రధానితో PCB చైర్మన్ నఖ్వీ అత్యవసర భేటీ

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పాల్గొనాలా.. వద్దా.. అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధానంగా టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ జట్టు పాల్గొనడంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు నఖ్వీ వెల్లడించారు. దేశ ప్రయోజనాలు క్రికెట్ భవిష్యత్తు అంతర్జాతీయ పరిస్థితులు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశం...