Protocol Controversy: రాహుల్ గాంధీ, ఖర్గేకి మూడో వరుసలో సీటు

Protocol Controversy: 77వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా జాతీయ పండుగను ఘనంగా నిర్వహిస్తూ దేశమంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలు దేశభక్తితో ఉప్పొంగిపోయాయి. సైన్యం, వైమానిక దళం, నౌకాదళం శక్తిసామర్థ్యాలను చాటుతూ నిర్వహించిన కవాతు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కవాతును పరిశీలించారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్య అతిథులు, సైనిక ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల...