‘సూసైడ్ చేసుకోవాలని ఉంది’.. సస్పెండెడ్ టీచర్ ఆవేదన

సోషల్ మీడియా యుగంలో రీల్స్ మోజు ఎంతగా పెరిగిందంటే, అది బాధ్యతాయుతమైన ఉద్యోగాలకూ ప్రమాదంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గౌతమి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన సమయంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ, ప్రైవేటు విద్యాసంస్థలు, కమర్షియల్ బ్రాండ్లకు ప్రచారం చేశారన్న ఆరోపణలతో ఆమెను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడిన తర్వాత గౌతమి మరోసారి సోషల్ మీడియా ద్వారా స్పందించడం వివాదానికి మరింత దారితీసింది. సస్పెన్షన్ తర్వాత విడుదల చేసిన రీల్స్ వీడియోలో గౌతమి తీవ్ర ఆవేదన...