Electric Cars: రూ.10 లక్షల లోపే బెస్ట్ కార్లు.. చుక్క పెట్రోల్ కూడా అవసరం లేదు

Electric Cars: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల దృష్టి వేగంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. కాలుష్యం లేకపోవడం, ఇంధన ఖర్చు తగ్గడం, మెయింటెనెన్స్ వ్యయం తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈవీలకు డిమాండ్ పెరుగుతోంది. అయితే ఎలక్ట్రిక్ కార్లు అంటే చాలా ఖరీదైనవనే అభిప్రాయం ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ తాజా మార్కెట్ పరిస్థితులు ఆ భావనను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడు భారత ఆటోమొబైల్ మార్కెట్లో మధ్య తరగతి ప్రజల బడ్జెట్‌కు సరిపోయేలా రూ.10 లక్షల లోపే అద్భుతమైన ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ సబ్సిడీలు, పెరుగుతున్న వినియోగదారుల ఆసక్తితో ఆటో కంపెనీలు...