పద్మశ్రీ గౌరవం.. నటుడు రాజేంద్రప్రసాద్ భావోద్వేగం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేక గర్వకారణంగా నిలిచింది ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ పురస్కారం లభించడమే. నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాల్లో తనదైన హాస్యంతో, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రాజేంద్ర ప్రసాద్‌కు ఈ గౌరవం లభించడం పట్ల సినీ వర్గాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్ర ప్రసాద్ ఓ వీడియో విడుదల చేసి తన భావాలను అభిమానులతో పంచుకున్నారు. పద్మశ్రీ పురస్కారం తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమని, ఈ అవార్డు తన ఒక్కడికే పరిమితం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది తెలుగు...