Pawan Kalyan: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉంటుంది

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ వేడుకలు కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలను స్పష్టంగా ప్రతిబింబించాయని ఆయన పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సోమవారం ఆయన తన స్పందనను వెల్లడించారు. నెల్లూరు జిల్లా నేలపాడు పరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని పవన్ కల్యాణ్ తెలిపారు. సక్రమమైన ఏర్పాట్లు, ప్రజల ఉత్సాహం, అధికార యంత్రాంగం సమన్వయంతో నిర్వహించిన కార్యక్రమం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచిందని ఆయన అన్నారు....