ఏపీ-తెలంగాణ మధ్య జల వివాదం.. గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదం మరోసారి రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో ప్రతిపాదిస్తున్న బనకచర్ల, పోలవరం- నల్లమలసాగర్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, ఈ వివాదం సుప్రీంకోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం తమ ప్రాజెక్టుల ద్వారా సముద్రంలో కలిసే నీటినే వినియోగిస్తామని, తెలంగాణకు చెందిన ఒక్క చుక్క నీటినీ ఉపయోగించబోమని స్పష్టం చేస్తోంది. ఈ పరిస్థితుల నడుమ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమరావతిలో నిర్వహించిన తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర అభివృద్ధి, జల వనరుల వినియోగం, సంక్షేమ...