MLC Nagababu: జెండా ఆవిష్కరణ విద్యార్థుల చేతుల మీదుగా చేయించాలి
MLC Nagababu: భారతదేశానికి స్వాతంత్ర్యం, గణతంత్ర విలువలు యాదృచ్ఛికంగా రాలేదని, దేశం కోసం కుటుంబాన్ని, సుఖాన్ని, ఆఖరికి ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానుభావుల పోరాట ఫలితమే నేటి భారతమని శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. ఈ త్యాగాల గాథలను రాబోయే తరాలకు బోధించడమే కాకుండా, దేశభక్తి భావన విద్యార్థుల హృదయాల్లో బలంగా నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. దేశభక్తి మాటల్లో కాకుండా, ఆచరణలో కనిపించాలన్నారు. చిన్నతనం...