Ponguleti Srinivas Reddy: భూభారతి చట్టంతో భూ సమస్యలకు పరిష్కారం

Ponguleti Srinivas Reddy: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, గతంలో ధరణి పేరుతో రైతులను మోసం చేసిన పాలనకు భిన్నంగా నేడు రైతుకు చుట్టంలా నిలిచే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి భూ సమస్యలకు పరిష్కారం చూపుతోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కష్టాలను గుండెతో అర్థం చేసుకుని, వారి జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే...