Uttam Kumar Reddy: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవ్వాలి
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేగంగా వేడెక్కుతోంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో, ఇక ఎన్నికల నగారా మోగేందుకు రంగం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుందని, అదే సమయంలో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఫిబ్రవరి రెండో వారంలోనే పోలింగ్ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని మంత్రి కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల సమీక్ష సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన...