Governor Jishnu Dev Verma: దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ
Governor Jishnu Dev Verma: దేశవ్యాప్తంగా అభివృద్ధికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన సోమవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. “రైజింగ్ తెలంగాణ-2047” అనే దృష్టితో రాష్ట్రం భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందని గవర్నర్ స్పష్టం చేశారు. దేశం 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, అందులో తెలంగాణ తన వంతుగా మూడు ట్రిలియన్ డాలర్ల...