Boiled Eggs: రోజూ రెండు ఉడకబెట్టిన గుడ్లు తింటే ఏమవుతుందో తెలుసా?

Boiled Eggs: ధరలో తక్కువగా లభించినా, పోషక విలువల్లో గుడ్లకు మించిన ఆహారం చాలా తక్కువనే చెప్పాలి. రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకునే ఈ గుడ్లు శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలను సమృద్ధిగా అందిస్తాయి. అందుకే వైద్యులు, పోషక నిపుణులు కూడా గుడ్లను సంపూర్ణ ఆహారంగా అభివర్ణిస్తుంటారు. ముఖ్యంగా ఉడికించిన గుడ్లు తీసుకోవడం వల్ల శరీరానికి హాని లేకుండా ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. గుడ్లు కేవలం కండరాల పెరుగుదలకే కాదు.. మెదడు పనితీరు మెరుగుపడటానికి, ఎముకలు బలపడటానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడడం నుంచి రోగనిరోధక శక్తి బలోపేతం వరకు గుడ్ల పాత్ర ఎంతో...