భోజనం చేసిన తర్వాత టీ తాగుతున్నారా..? అయితే ఇది తెలుసుకోండి!

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే పానీయాల్లో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో అయితే టీ లేకుండా ఉదయం మొదలవదనే చెప్పాలి. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ఒక కప్పు టీతోనే రోజు ప్రారంభమవుతుంది. కొందరికి అది అలవాటు కాదు, ఆరాధనలా మారిపోయింది. సమయం, సందర్భం చూడకుండా రోజుకు ఎన్నిసార్లైనా టీ తాగేవాళ్లు చాలామందే. అయితే ఈ అలవాట్లలో కొన్ని ఆరోగ్యానికి మెల్లగా ప్రమాదంగా మారుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భోజనంతో పాటు లేదా భోజనం వెంటనే టీ తాగడం రుచిగా అనిపించినా, అది శరీరానికి మేలు చేయదని చెబుతున్నారు. బయటకు చిన్న అలవాట్లా కనిపించే ఈ విషయం, లోపల మాత్రం పెద్ద ఆరోగ్య సమస్యలకు...