Height: పురుషులు స్త్రీల కంటే హైట్‌గా ఉండటానికి అసలు కారణం ఇదేనట!

మనకు చిన్నతనం నుంచే కనిపించే సాధారణమైన విషయం ఏంటంటే పురుషులు సాధారణంగా స్త్రీలకంటే ఎక్కువ ఎత్తుగా ఉండటం. చాలామందికి ఇది సహజమైన ప్రక్రియగా అనిపించవచ్చు.

Height: మనకు చిన్నతనం నుంచే కనిపించే సాధారణమైన విషయం ఏంటంటే పురుషులు సాధారణంగా స్త్రీలకంటే ఎక్కువ ఎత్తుగా ఉండటం. చాలామందికి ఇది సహజమైన ప్రక్రియగా అనిపించవచ్చు. కానీ ఇందుకు గల కారణాలను కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడించాయి. ఈ వ్యత్యాసం వెనుక గణనీయమైన జీవశాస్త్ర, జన్యుపరమైన కారణాలు ఉన్నాయని తెలిపాయి.

పురుషులు సగటుగా స్త్రీలకంటే సుమారు 5 అంగుళాలు పొడవుగా ఉంటారు. అమెరికా, బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం దాదాపు 10 లక్షల మందికి పైగా వ్యక్తుల DNA విశ్లేషణ చేసి, ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపింది. వారి పరిశోధనలు “ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్” అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

మన శరీరంలో ఎత్తును నియంత్రించేందుకు SHOX అనే ప్రత్యేక జన్యువు (Short Stature Homeobox) ఉంటుంది. ఇది పురుషుల Y క్రోమోజోమ్‌లో చురుకుగా పనిచేస్తుంది. పురుషులు XY క్రోమోజోమ్ కలిగి ఉండగా, స్త్రీలు XX కలిగి ఉంటారు. స్త్రీలలో కూడా SHOX జన్యువు ఉంటేనూ, Y క్రోమోజోమ్ లేకపోవడం వల్ల దాని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇది పురుషులలో ఎత్తు ఎక్కువగా ఉండటానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు.

అంతేకాదు, అదనపు Y క్రోమోజోమ్ ఉన్న వ్యక్తులు మరింత పొడవుగా ఉంటారని పరిశోధనలో తేలింది. అయితే అదనపు X క్రోమోజోమ్ అంత ప్రభావం చూపదు. ఇకపోతే, హార్మోన్ల ప్రభావం, యుక్తవయస్సులో శరీర అభివృద్ధి, ఎముకల సాంద్రత వంటి అంశాలు కూడా ఎత్తు పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా, స్త్రీల శరీరంలో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ ఎముకల పెరుగుదలపై నియంత్రణ కల్పిస్తుంది.

Also Read: Maharashtra: ఒక్క వర్షానికే.. ముంబై హైవేపై గుంతలు.. దెబ్బతిన్న 260 ఇళ్లులు

Height: పురుషులు స్త్రీల కంటే హైట్‌గా ఉండటానికి అసలు కారణం ఇదేనట!

📲 Follow Us

Star Trinethram

Star Trinethram (Telugu News) is Top News Source That Provide Latest and Breaking News in Telugu. Read Andhra Pradesh, Telangana, National and International Telugu News Updates Online. News on Politics, Business, Entertainment, Technology, Sports, Lifestyle and more at startrinethram.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *