Viral: హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ రాసిన చెక్కు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆయన ఇంగ్లిష్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతూ, సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే – సెప్టెంబర్ 25న ఒక వర్కర్ కు రూ.7,616 చెక్కు ఇచ్చారు. కానీ ఆ చెక్కుపై అమౌంట్ రాసిన విధానం అందరినీ షాక్‌కు గురిచేసింది. సాధారణంగా చెక్కులో మొత్తం ‘Seven Thousand Six Hundred Sixteen Only’ అని రాయాలి. కానీ ఆయన మాత్రం “Saven Thursday Six Harendra Sixty” అని రాశారు. ఫలితంగా బ్యాంకు అధికారులు అసలు మొత్తం ఏమిటో అర్థం కాక, ఆ చెక్కును రిజెక్ట్ చేశారు.
ఈ సంఘటన బయటకు రావడంతో ప్రిన్సిపల్‌ను నిజంగా ఆయనే రాశారా? లేక ఇంకెవరైనా రాసారా? అన్న సందేహం నెటిజన్లలో మొదలైంది. అయితే ఏదేమైనా, సంతకం చేసే ముందు కనీసం ఒకసారి చూసుకోవాల్సిందిగా అనైతే కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే, “ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంగ్లిష్‌లో ఇలా తప్పులు చేస్తే విద్యార్థులు ఏమి నేర్చుకుంటారు?” అంటూ విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం సరదాగా తీసుకుంటూ “ఇదే ఒరిజినల్ క్రియేటివిటీ” అని హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు.
మొత్తానికి, ఈ చిన్న తప్పిదం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఒక చెక్కు వల్ల ఇంత హంగామా జరుగుతుందని ఎవరికీ ఊహకూడా రాకపోవచ్చు.


