Grama Sabha: గ్రామసభలో పెట్రోల్ పోసుకుని సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
Grama Sabha: తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న గ్రామసభలు రోజు రోజుకు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటుండగా తాజాగా జగిత్యాలలో మరో దారుణం జరిగింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్ నాగరాజు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పెండింగ్ బిల్లులు అంశమే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

తెలంగాణలో జరుగుతున్న గ్రామసభల్లో అర్హులకు కాకుండా అనర్హులకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభల్లో గ్రామస్తులు ఆందోళనకు దిగుతున్నారు. ఎమ్మెల్యేలు, అధికారులను నిలదీస్తున్నారు. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోతుందని ప్రతిపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. విపరీతంగా పెండింగ్ బిల్లులు సైతం ఉండిపోయాయని వీటికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులపై ఉన్న బకాయిలను తీర్చాలని ప్రజలకు న్యాయం చేయాలని ఆందోళన చేపడుతున్నారు.
ఫిబ్రవరిలో తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదాలు ప్రతి చోట అధికార ప్రతిపక్షాల మధ్య అగ్గిరాజేస్తున్నాయి. ప్రజలకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న వేళ.. తాము ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని అధిరారపక్షం చెబుతుంది.
ALSO READ: Janasena: ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత బలం జనసేనకు ఉందా..?
Grama Sabha: గ్రామసభలో పెట్రోల్ పోసుకుని సర్పంచ్ ఆత్మహత్యాయత్నం