RAPE: తల్లితో సహజీవనం చేస్తూనే ఆమె కూతుళ్లపై అత్యాచారం
RAPE: సూర్యాపేటలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య చనిపోవడంతో పరాయి మహిళతో సహజీవనం చేస్తోన్న ఓ వ్యక్తి, ఆమె కూతుళ్లపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి స్థానంలో ఉండాల్సిన అతను ఆడపిల్లలపై దారుణానికి పాల్పడ్డాడు.

RAPE: సూర్యాపేటలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య చనిపోవడంతో పరాయి మహిళతో సహజీవనం చేస్తోన్న ఓ వ్యక్తి, ఆమె కూతుళ్లపైనా అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రి స్థానంలో ఉండాల్సిన అతను ఆడపిల్లలపై దారుణానికి పాల్పడ్డాడు.
అందులోనూ అతను ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టిన దుర్మార్గుడికి హెచ్ఐవీ పాజిటీవ్ గా తేలడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
సూర్యాపేటకు చెందిన జాటోత్ సునీల్ కుమార్ అనే వ్యక్తి ప్రభుత్వ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. తన భార్య చనిపోవడంతో స్థానికంగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తోన్న అతను.. సంబంధం కలిగిన మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారంతా సూర్యాపేటలో నివసిస్తుండగా, ఆ మహిళకు దగ్గరైన సునీల్ కుమార్.. తరచూ వాళ్లింటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ వ్యవహారం 2018 నుంచి నడుస్తోంది.
ఈ క్రమంలో సదరు మహిళతో సహజీవనం చేస్తూనే ఇంట్లో లేని సమయాల్లో ఆమె పిల్లల్ని లొంగదీసుకున్నాడు. వారిపై తరచూ అత్యాచారానికి పాల్పడుతూ.. ఆ విషయం వారి తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. దాంతో.. ఆ బాలికలు ఈ దారుణాన్ని వాళ్లమ్మకు చెప్పకుండా ఆగిపోయారు. వాళ్లిద్దరూ 19, 15 ఏళ్ల వయసే కావడం గమనార్హం.
ఇటీవలే వైద్య పరీక్షలు చేయించుకున్న సునీల్ కుమార్ కు హెచ్ఐవీ ఎయిడ్స్ సోకినట్లుగా తెలిసింది. ఈ విషయం బాలికలకు తెలియడంతో తీవ్రంగా భయపడిపోయారు. దాంతో వారిపై గత కొన్నాళ్లుగా జరుగుతున్న దారుణాన్ని తల్లి దృష్టికి తీసుకువచ్చారు.
దీంతో ఆ దుర్మార్గుడిని ఎలాగైనా శిక్షించాలని, అతడు చేసిన దారుణాన్ని ఆ తల్లి పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత పోలీసులు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సునీల్ కుమార్ పై కేసు నమోదు చేశారు. పోక్సో యాక్ట్ కింద అతనిపై పలు సెక్షన్లు మోపారు.
ALSO READ: Pradakshina in temples: ఆలయాల్లో ప్రదక్షిణ ఎందుకు చేయాలి.. దాని అర్థం, ప్రదక్షిణలో రకాలు
RAPE: తల్లితో సహజీవనం చేస్తూనే ఆమె కూతుళ్లపై అత్యాచారం