Pawan Kalyan: కేబినేట్ భేటీ నుంచి సడెన్ గా వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్.. అసలేమైందంటే..
ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జరిగింది.
Pawan Kalyan: ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కాసేపటికే వెళ్లిపోయారు. పవన్ కల్యాణ్ ఇటీవల అరకు పర్యటనలో ఉన్నప్పుడే సింగపూర్ తన కుమారుడికి అగ్నిప్రమాదం గురించి తెలిసింది. మానసికంగా ఒత్తిడికి గురైన పవన్ కల్యాణ్.. కుమారుడ్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చారు. కానీ ఆయన అలసటకు గురయ్యారు. ఈ కారణంగా ఆయన సతీమణి అన్నా లెజ్ నోవా ఒక్కరే తిరుపతికి వెళ్లి మొక్కులు సమర్పించుకున్నారు. కేబినెట్ భేటీ కోసం ఆయన అమరావతికి వచ్చినప్పటికీ.. ఆరోగ్యం సహకరించలేదు. కేబినెట్ సమావేశానికి హాజరై…కూర్చోలేని పరిస్థితి ఉండటంతో విషయం చెప్పి వెళ్లిపోయారు.
కేబినెట్ సమావేశం గురించి ప్రభుత్వ సమాచార మంత్రిత్వ ఫోటోలు రిలీజ్ చేసింది ఈ ఫోటోల్లో పవన్ కల్యాణ్ కుర్చీ ఖాళీగా ఉంది. దీంతో అందరూ పవన్ కల్యాణ్ కేబినెట్ సమావేశానికి రాలేదా అని ఆరా తీయడం ప్రారంభించారు. అయితే అధికార వర్గాలు మాత్రం పవన్ కేబినెట్ సమావేశానికి వచ్చారని కానీ అనారోగ్యం కారణంగా ఉండలేకపోవడంతో వెళ్లిపోయారని క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గతంలోనూ అనారోగ్యం కారణంతో ఒకటి, రెండు సార్లు కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటూ ఉండిపోయారు.
ఫిబ్రవరిలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీకి కూడా పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్ కారణంగా పవన్ కల్యాణ్ ఏపీ మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేకపోయారు. ఈ విషయాన్ని అప్పట్లో డిప్యూటీ సీఎంవో వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచనతో పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారని అప్పట్లో ప్రకటన కూడా విడుదల చేశాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం సమయంలోనూ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో ప్రచారం సమయంలో జనసేన అధిష్ఠానం.. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు కూడా అప్పట్లో చేసింది. పూలదండలు వేయొద్దంటూ అప్పట్లో కీలక సూచనలు చేసింది.
Also Read : Mumbai Court : పోక్సో కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు!
Pawan Kalyan: కేబినేట్ భేటీ నుంచి సడెన్ గా వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్.. అసలేమైందంటే..