జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే
స్టార్ త్రినేత్రం, రాయపర్తి: రాయపర్తి మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ క్రీడోత్సవాలకు శుక్రవారం ఎమ్మెల్యే యశస్విని రాజరామ్మోహన్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై, ప్రారంభించారు.
స్టార్ త్రినేత్రం, రాయపర్తి: రాయపర్తి మండల కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ క్రీడోత్సవాలకు శుక్రవారం ఎమ్మెల్యే యశస్విని రాజరామ్మోహన్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై, ప్రారంభించారు.
క్రీడా ఉత్సవాలను ప్రారంభించేందుకు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన ఎమ్మెల్యే క్రీడాకారులతో సమావేశమై వారితో ముచ్చటించారు. అనంతరం ఉత్సవాలను ప్రారంభిస్తూ క్రీడా జ్యోతి వెలిగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. క్రీడల ప్రాముఖ్యత గురించి వివరించారు. క్రీడలు మన శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక శక్తిని కూడా పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా క్రమశిక్షణ, సహనం, సామూహిక సమన్వయం వంటి విలువలను నేర్చుకోవచ్చని చెప్పారు.
జిల్లాస్థాయి క్రీడా ఉత్సవాలు యువతలోని క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి ఒక గొప్ప వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నదని, గ్రామీణ స్థాయిలోనూ క్రీడా సౌకర్యాలను మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నదని వివరించారు.
ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని రాష్ట్రం తరఫున జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
యువ క్రీడాకారులకు పిలుపునిస్తూ, క్రీడలను మనుగడగా తీసుకొని కృషి చేయాలని, విజయాల కోసం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా జీవితంలో ఉన్న ప్రతిస్పర్థలను అధిగమించే శక్తి ఏర్పడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, అనుబంధం సంఘ నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రీడా ప్రేమికులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఉత్సవాలను విజయవంతం చేశారు.
ALSO READ: పంచాయతీరాజ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే సమీక్ష
జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించిన పాలకుర్తి ఎమ్మెల్యే