Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నాడు. ఇటీవల విడుదలైన “మిరాయ్” సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ఆయన నటనకు – ముఖ్యంగా విలన్ పాత్రకు – మంచి మార్కులు పడ్డాయి. ఈ విజయంతో వరుసగా కొత్త సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఆయన ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన కెరీర్, వ్యక్తిగత జీవితం, రూమర్లు, రాజకీయ ప్రవేశం వంటి అనేక విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రోమోలో ముఖ్యంగా తన బయోపిక్ గురించి మాట్లాడారు. “నా బయోపిక్ తీస్తే సందీప్ రెడ్డి వంగా మాత్రమే తీయగలడు. ఎందుకంటే నేను ‘ది వైల్డెస్ట్ ఎనిమల్’ కదా!” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
ఇటీవల తేజ సజ్జాతో తగవులపై వచ్చిన రూమర్లను కూడా మనోజ్ ఖండించారు. “నేను ఎవరితోనైనా గొడవ పడ్డా దూరంగా ఉంటాను. కౌగిలించుకోవడానికి వచ్చినా అక్కడే ఆపేస్తాను. అలాంటి పరిస్థితులు వస్తే నాకే నిద్ర పట్టదు. కాబట్టి నేను ఎవరితోనూ పెద్దగా గొడవ పడను” అని స్పష్టంచేశారు.
అలాగే తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన మార్పుల గురించి కూడా చెప్పారు. “నా భార్య మౌనిక రెడ్డి వచ్చిన తర్వాత నా లైఫ్‌లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఇంటికి త్వరగా వెళ్తున్నాను. ఆమె వండినదే తింటున్నాను. జీవితం మనకు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి అనేది నేర్పిస్తుంది” అని అన్నారు.
తన రాజకీయ ఎంట్రీ సహా ఇతర విషయాలపై కూడా మనోజ్ స్పందించారు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలోనే విడుదల కానుందని ఎన్టీవీ ప్రకటించింది. ఈ పాడ్‌కాస్ట్ ద్వారా మనోజ్ తన కెరీర్‌లోని ఎన్నో తెలియని విషయాలను పంచుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.


