Mangala Sutra: మంగళ సూత్రం విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి
వివాహిత మహిళలు మంగళసూత్రం ధరించడం హిందూ సాంప్రదాయాలలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని తెలియజేసే పవిత్ర గుర్తుగా భావిస్తారు. మంగళసూత్రం అంటే మంగళకరమైన బంధం.
Mangala Sutra: వివాహిత మహిళలు మంగళసూత్రం ధరించడం హిందూ సాంప్రదాయాలలో ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంది. ఇది భార్యాభర్తల మధ్య బంధాన్ని తెలియజేసే పవిత్ర గుర్తుగా భావిస్తారు. మంగళసూత్రం అంటే మంగళకరమైన బంధం. ఇది భార్య నిబద్ధతకు, ప్రేమకు ప్రతీక. వివాహానంతరం మహిళలు మంగళసూత్రంతో పాటు ఉంగరం, కాలిమెట్టలు, నుదుటిపై కుంకుమ ధరించడం వారి వైవాహిక స్థితిని తెలియజేస్తుంది. ఈ అలంకరణలు ఆమెకు కుటుంబ బాధ్యతను నిర్వహించే సామర్థ్యాన్ని, గౌరవాన్ని చాటి చెబుతాయి.
సమాజంలో మహిళకు విశిష్టమైన స్థానం దక్కించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. శాస్త్రం ప్రకారం, మంగళసూత్రాన్ని ఎప్పుడూ మెడకు ధరించే ఉంచాలని చెప్పారు. దీన్ని తీయడం వల్ల భర్త ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని చాలా మంది నమ్మకం. మంగళసూత్రంలోని నల్లపూసలు నరదిష్టు నుంచి భర్తను రక్షిస్తాయని విశ్వసిస్తారు. ఇది భర్తకు దీర్ఘాయుష్ కలిగించడంలో సహాయపడుతుందని శాస్త్రం చెబుతోంది.
అంతేకాదు మంగళసూత్రానికి పిన్నిసులు లేదా హెయిర్‌పెన్నులు కూడా పెట్టకూడదని చెబుతారు. ఇది అనుకూలం కాదని భావిస్తారు. అందుకే మంగళసూత్రాన్ని శ్రద్ధగా, భక్తితో ధరించడం అవసరం. భార్యాభర్తల మధ్య ప్రేమ, నమ్మకానికి గుర్తుగా మంగళసూత్రాన్ని భావించాలి. హిందూ సాంప్రదాయాలలో మహిళలకు వివాహ అనంతరం మంగళసూత్రాన్ని ధరించడం అనేది వైవాహిక జీవితానికి ఒక అర్థం. కావున భర్త ఆయుష్షు కోసం మంగళసూత్రాన్ని ఎప్పటికీ మెడలోనే నుంచి ఉంచుకోవాలి.
Also Read: Height: పురుషులు స్త్రీల కంటే హైట్‌గా ఉండటానికి అసలు కారణం ఇదేనట!
Mangala Sutra: మంగళ సూత్రం విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి