Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు ఉపసంహరించుకున్న నాగార్జున

cinema Telangana

Nagarjuna: మంత్రి కొండా సురేఖ, నటుడు అక్కినేని నాగార్జున మధ్య నెలలుగా సాగుతున్న వివాదానికి చివరకు ముగింపు లభించింది. మంత్రి సురేఖ గతంలో నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేశారు. అయితే నిన్న మంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున ఇవాళ నాంపల్లి కోర్టులో కేసును ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కినేని కుటుంబం, సురేఖ మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా సద్దుమణిగింది.

ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ కేసుల ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ దావాను కొట్టివేసింది. నాగార్జున వర్చువల్‌గా హాజరై భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 280 కింద కేసు ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి సురేఖ ఈ సందర్భంగా మాట్లాడుతూ ..కేటీఆర్ చేసిన వ్యాఖ్యల కారణంగా భావోద్వేగానికి లోనై నాగార్జున కుటుంబాన్ని ప్రస్తావించానని వివరించారు. తమకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని, అనుకోకుండా చేసిన వ్యాఖ్యలపై బాధపడి వెంటనే వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. “నా మాటలతో ఎవరికైనా బాధ కలిగితే చింతిస్తున్నా” అంటూ మంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఆమె క్షమాపణను అక్కినేని నాగార్జున సానుకూలంగా స్వీకరించడంతో వివాదానికి తెరపడింది.

ALSO READ: So Much Talent: అసలు ఇతను మనిషా..? రబ్బరు బొమ్మనా..?

Nagarjuna: మంత్రి కొండా సురేఖపై కేసు ఉపసంహరించుకున్న నాగార్జున