MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఫిక్స్ అయ్యాయి. తెలంగాణ విషయానికొస్తే.. ఈ లిస్ట్ లో కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది.
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఫిక్స్ అయ్యాయి. తెలంగాణ విషయానికొస్తే.. ఈ లిస్ట్ లో కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌లను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇప్పటికే ఓ సీటును సీపీఐకి కాంగ్రెస్ ఇచ్చింది. కాగా, అధిష్టానం కోటాలో విజయశాంతికి టికెట్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే విజయశాంతి పేరు ఊహించని విధంగా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ పేరు ప్రకటించారు. మరోపక్క ఏపీలో టీడీపీ నుంచి కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, జనసేన తరపున నాగబాబు టికెట్లు దక్కించుకున్నారు. బీజేపీ అభ్యర్థిని నేడు ప్రకటించనున్నారు.
పార్టీలో చేరిన సమయంలోనే ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విజయశాంతిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించారు. అయితే, శంకర్ నాయక్ పేరు ఎవరు ప్రస్తావించకపోయినప్పటికీ.. ఆయనకు టికెట్ రావడం కూడా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సన్నిహితులకు కూడా టికెట్ దక్కుతుందని ఆశించినప్పటికీ.. అలా కూడా జరగలేదు. ఇక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రభావితం చూపే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుందని భావించినప్పటికీ.. నిరాశ ఎదురైంది. రేవంత్ మిత్రుడుగా పేరున్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కుసుమ కుమార్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగినప్పటికీ.. ఆయనకు కూడా మొండి చేయే దక్కింది. ఎన్నికలు
ఎమ్మెల్యేల కోటా నుంచి ఐదు ఎమ్మెల్సీల ఎన్నికకు ఈ నెల 10వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా మూడు కాంగ్రెస్‌కు, ఒకటి బీఆర్‌ఎస్ కు వస్తాయి. ఐదో స్థానం కోసం ఎంఐఎంతోపాటు మరికొన్ని ఓట్లు అవసరమవుతాయి. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారు ఓట్లు వేస్తే కాంగ్రెస్‌కు నాలుగో సీటు లభించే అవకాశం ఉన్నా సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలు ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
ALSO READ: women’s day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఎప్పుడు, ఎలా మొదలైందంటే..
MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు