May Day 2025: మే డే ఎలా, ఎందుకు మొదలైంది.. ఈ రోజు ప్రాముఖ్యతేంటంటే..
ఏటా మే 1న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని లేదా ఈ రోజునే మే డే అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సంఘీభావంగా ఐక్యమయ్యారు.
May Day 2025: ఏటా మే 1న, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని లేదా ఈ రోజునే మే డే అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సంఘీభావంగా ఐక్యమయ్యారు. ఎనిమిది గంటల పనిదినం కోసం వారు చేసిన పోరాటం ఈ రోజుకు ఓ జ్ఞాపికగా మిగిలిపోయింది. కార్మికుల అంకితభావం, చెమట వారి కృషిని గుర్తించడం మాత్రమే కాదు, వారి హక్కుల గురించి తెలుసుకోవడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అయితే అసలు ఈ మే డే అనే దినోత్సవం ఎలా, ఎందుకు మొదలైందో ఇప్పుడు తెలుసుకుందాం.
మే డే మూలాలను 19వ శతాబ్దం చివరి నుండి, ముఖ్యంగా 1886లో చికాగోలో జరిగిన హేమార్కెట్ ఊచకోత నుండి గుర్తించవచ్చు. అమెరికాలోని పారిశ్రామిక నగరమైన చికాగోలో వేలాది మంది బ్లూ కాలర్ కార్మికులు మెరుగైన పని పరిస్థితులను కోరుతూ, వారి పని గంటలను రోజుకు 12-15 గంటల నుండి ఎనిమిది గంటలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారీ సమ్మెకు దిగారు. ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాపించి, వేలాది మంది కార్మికులను సమీకరించింది. మే 4, 1886న, చికాగోలోని హేమార్కెట్ స్క్వేర్ వద్ద జరిగిన నిరసన ర్యాలీలో బాంబు పేలింది. కార్మికులు పోలీసులతో ఘర్షణ పడటంతో అల్లర్లకు దారితీసింది.
ఈ ఘటనలోదాదాపు 11 మంది మరణించారు. హేమార్కెట్ ఊచకోతగా పిలుచుకుడే ఈ సంఘటన, మే 1ని కార్మికుల దినోత్సవంగా గుర్తించడానికి, జరుపుకోవడానికి కారణంగా పరిగణించబడుతుంది. 1889లో ఉద్భవించిన రెండవ అంతర్జాతీయ (సోషలిస్ట్, కార్మిక పార్టీల సంస్థ) కార్మిక హక్కుల పోరాటాన్ని గౌరవించడానికి, చికాగోలో మరణించిన వారికి నివాళిగా మే 1ని అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా ప్రకటించింది.
ఇక ఈ రోజు ప్రాముఖ్యత విషయానికొస్తే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం కార్మిక హక్కులు, రక్షణలను పొందడంలో సాధించిన పురోగతిని, అలాగే వివిధ పరిశ్రమలు, ప్రాంతాలలో కార్మికులు ఎదుర్కొంటున్న నిరంతర పోరాటాలను, ముఖ్యంగా సాంకేతికత, ప్రపంచీకరణ ద్వారా రూపొందించిన నేటి వేగంగా మారుతున్న కార్యాలయాలలో గుర్తు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనియన్లు పని ప్రదేశంలో తాము ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల గురించి అవగాహన పెంచడానికి, న్యాయమైన వేతనాలను డిమాండ్ చేయడానికి, కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి ఆలోచనలను అందించడానికి మే దినోత్సవాన్ని ఉపయోగిస్తాయి.
Also Read : Census: జనాభా లెక్కల్లోనే కులగణన.. కేంద్రం కీలక నిర్ణయం
May Day 2025: మే డే ఎలా, ఎందుకు మొదలైంది.. ఈ రోజు ప్రాముఖ్యతేంటంటే..