Pak Woman: పాక్ మహిళను పెళ్లి చేసుకున్న జవాన్.. డిస్మిస్ చేసిన అధికారులు.. కానీ..
పాకిస్తాన్ మహిళతో తన వివాహం దాచిపెట్టారనే ఆరోపణలతో సర్వీస్ నుండి తొలగించిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్ మునీర్ అహ్మద్, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
Pak Woman: పాకిస్తాన్ మహిళతో తన వివాహం దాచిపెట్టారనే ఆరోపణలతో సర్వీస్ నుండి తొలగించిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్ మునీర్ అహ్మద్, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. వివాహం చేసుకునే ముందు సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం నుండి ముందస్తు అనుమతి పొందారని చెప్పారు. “నా తొలగింపు గురించి నాకు మొదట మీడియా నివేదికల ద్వారానే తెలిసింది. ఆ తర్వాతే త్వరలోనే నాకు సీఆర్ఫీఎఫ్ నుండి తొలగింపు గురించి తెలియజేస్తూ ఒక లేఖ వచ్చింది. ఇది నాకు, నా కుటుంబానికి షాక్ ఇచ్చింది, ఎందుకంటే నేను ప్రధాన కార్యాలయం నుండి ఒక పాకిస్తానీ మహిళతో నా వివాహం కోసం అనుమతి కోరాను, పొందాను కూడా” అని ఆయన చెప్పారు.
ఆ మహిళ వీసా చెల్లుబాటును దాటి భారతదేశంలో ఉండటానికి అహ్మద్ ఉద్దేశపూర్వకంగా సహాయం చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అతను తన తొలగింపును కోర్టులో సవాలు చేయాలని యోచిస్తున్నాడు. జమ్మూలోని ఘరోటా ప్రాంతానికి చెందిన అహ్మద్, ఏప్రిల్ 2017లో CRPFలో చేరారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన మినాల్ ఖాన్‌ను ఆన్‌లైన్‌లో పరిచయమైన వారు 2024 మేలో వివాహం చేసుకున్నారు. మే 24, 2024న వీడియో కాల్ నిఖా వేడుక ద్వారా వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అహ్మద్ ప్రకారం, సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయం నుండి అధికారిక అనుమతి పొందిన దాదాపు ఒక నెల తర్వాత ఈ వివాహం జరిగింది.
“సస్పెషన్షన్ నాకు షాక్ ఇచ్చింది” అని అహ్మద్ చెప్పారు. “నాకు మొదట మీడియాలో వార్తలు చూసినప్పుడే తెలిసింది. ఆపై సీఆర్‌పీఎఫ్ నుండి అధికారిక లేఖ అందింది. కానీ నేను పెళ్లి చేసుకునే ముందు దళం నుండి అవసరమైన అనుమతులు కోరాను, పొందాను” అని ఆయన అన్నారు. మరోపక్క అహ్మద్ ఒక పాకిస్తానీ జాతీయురాలితో తన వివాహాన్ని వెల్లడించడంలో విఫలమయ్యారని, ఆమె వీసా గడువు ముగిసిన తర్వాత ఆమెను భారతదేశంలో ఎక్కువ కాలం ఉండటానికి అనుమతించారని సీఆర్పీఎఫ్ వాదిస్తోంది. ఇది సేవా ప్రవర్తన నియమాలను ఉల్లంఘించడమే కాకుండా జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంది. 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌కు భారతదేశం దౌత్యపరమైన ప్రతిస్పందనను పెంచిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : Badrinath Temple: 6 నెలల తర్వాత తెరుచుకున్న ఆలయం… 15 టన్నుల పూలతో అలంకారం
Pak Woman: పాక్ మహిళను పెళ్లి చేసుకున్న జవాన్.. డిస్మిస్ చేసిన అధికారులు.. కానీ..