Karnataka : రీల్ కాదు రియల్.. చోరీ చేసిన సొమ్ముతో సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
టాలీవుడ్ లో వచ్చిన రవితేజ కిక్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో దొంగతనం చేసి, చిన్న పిల్లల వైద్యం కోసం వెచ్చించడం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Karnataka : టాలీవుడ్ లో వచ్చిన రవితేజ కిక్ సినిమా చూసే ఉంటారు. అందులో హీరో దొంగతనం చేసి, చిన్న పిల్లల వైద్యం కోసం వెచ్చించడం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అదే తరహాలో ఓ వ్యక్తి భారీ మోసాలకు పాల్పడుతూ.. దోచుకున్న సొమ్మును సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇప్పటివరకు అతనిపై దాదాపు 300కు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ. 30 లక్షల విలువ చేసే 412 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటకకు చెందిన శివప్రసాద్ అలియాస్ మంత్రి శంకర్‌పై 300కు పైగా దొంగతనం కేసులు నమోదయ్యాయి. ప్రసాద్ కు 40 ఏళ్ల నేర చరిత్ర ఉందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో అతనిపై 260 కి పైగా కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడి నుంచి సుమారు రూ. 30 లక్షల విలువ చేసే 412 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు శివప్రసాద్ కోట్ల రూపాయల విలువైన సొత్తును అపహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
అతని నేర ప్రయాణం 14 ఏళ్ల వయసులోనే ప్రారంభమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కలబురగి జిల్లాలో 10 దోపిడీ కేసుల్లో తనకు సంబంధం ఉందని విచారణలో వెల్లడించాడు. ఈస్ట్ జోన్ డీసీపీ బాల స్వామి తెలిపిన వివరాల ప్రకారం, బీదర్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్ సమీపంలోని ఏటీఎంలో ఈ ముఠా అత్యంత క్రూరమైన వ్యూహాన్ని ఉపయోగించి దోపిడీకి పాల్పడింది. వారు బ్యాంకు సిబ్బందిపై కారం పొడి చల్లి ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు, ఈ కాల్పుల్లో గిరి వెంకటేష్ అనే ఒక ఉద్యోగి మరణించగా, శివ కాశీనాథ్ అనే మరొక ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఏటీఎం రీఫిల్స్ కోసం ఉంచిన నగదుతో ఆ ముఠా పారిపోయింది.
Also Read : Meerut: భర్త గడ్డం తీయట్లేదని మరిదితో పారిపోయిన వదిన
Karnataka : రీల్ కాదు రియల్.. చోరీ చేసిన సొమ్ముతో సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు