ఎమ్యెల్యేకు వినతిపత్రం ఇచ్చిన ప్రజాసంఘాల నాయకులు
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును ఆదివారం ఆయన నివాసంలో ప్రజాసంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు కంజర్ల మహేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

అనంతరం కంజర్ల మహేష్ మాట్లాడుతూ.. వర్ధన్నపేటలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇంటిగ్రేట్ మార్కెట్ కాంప్లెక్స్ పనులు పూర్తి చేయించాలని కోరినట్లు తెలిపారు. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం చేపట్టాలని, వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అనుభవజ్ఞులైన సీనియర్ వైద్యాధికారిని సూపరిండెంట్‌గా నియమింపచేయాలని వినతి పత్రంలో కోరామన్నారు.
వర్ధన్నపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, వర్ధన్నపేటకు మరొక ఎస్బిఐ (SBI) బ్యాంకు బ్రాంచినీ ఏర్పాటు చేయాలన్నారు. వర్ధన్నపేట పట్టణంలో ప్రభుత్వ భూములను గుర్తించి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కంజర్ల మహేష్, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా కో- కన్వీనర్ జంగిలి భాస్కర్, ఆర్ఎస్పీ వరంగల్ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్, టీఏఎస్ జిల్లా కన్వీనర్ తాటికాయల వివేక్, నాయకులు కంజర్ల రాజు, బొక్కల గణేష్, మంజునాథ్, రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: హన్మకొండలో అట్టహాసంగా లలిత జ్యువెలరీ మార్ట్ ప్రారంభం
ఎమ్యెల్యేకు వినతిపత్రం ఇచ్చిన ప్రజాసంఘాల నాయకులు