Kamal Hassan: సారీ చెప్పను.. కర్ణాటకలో రిలీజ్ చేయను.. ‘థగ్ లైఫ్’పై విశ్వ నటుడు కీలక వ్యాఖ్యలు

నటుడు కమలహాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మరోసారి స్పందిస్తూ వివరణ ఇచ్చారు. కన్నడ భాషపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ

Kamal Hassan: నటుడు కమలహాసన్ ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మరోసారి స్పందిస్తూ వివరణ ఇచ్చారు. కన్నడ భాషపై తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. “నాకు కన్నడ భాష అంటే అమితమైన ప్రేమ ఉంది. మన దేశం మొత్తంగా ఒకే భాష అన్న భావనతోనే నేను మాట్లాడాను. కన్నడను కించపరిచే ఉద్దేశం నాకు లేదు, అలాంటి ఆలోచన రావడం కూడా లేదు” అని తెలిపారు.

తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, అవే వ్యాఖ్యలు ఇతరులకు కూడా తప్పుడు రీతిలో కన్వే చేస్తున్నారని ఆయన వాపోయారు. “నేను ఎలాంటి తప్పు చేయలేదు. తప్పుడు వ్యాఖ్యలు చేసే మనిషిని కాదు కాబట్టే క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పను కూడా” అని కమలహాసన్ స్పష్టం చేశారు. ఈ వివాదం నేపథ్యంలో ‘థగ్ లైఫ్’ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఇది సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇక తాజాగా కమలహాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమా కన్నడలో విడుదలయ్యేలా చూడాలని, అలాగే తగిన భద్రత కల్పించాలని ఆయన పిటిషన్‌లో కోరారు. ఈ కేసులో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, కన్నడ ఫిలిం ఛాంబర్, ఇతర సంస్థలను కూడా ప్రతివాదులుగా చేర్చారు. అంతేకాకుండా సినిమా విడుదల సమయంలో బెంగళూరు పోలీస్ కమిషనర్, డీజీపీలు తగిన భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో విజ్ఞప్తి చేశారు.

‘థగ్ లైఫ్’ సినిమాను మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శింబు, త్రిష తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోతే దాదాపు రూ.20 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: Vitamin B12: ఎవ్వరినైనా తాకితే షాక్ కొడుతుందా.. కారణం ఇదేనట

Kamal Hassan: సారీ చెప్పను.. కర్ణాటకలో రిలీజ్ చేయను.. ‘థగ్ లైఫ్’పై విశ్వ నటుడు కీలక వ్యాఖ్యలు

📲 Follow Us

Star Trinethram

Star Trinethram (Telugu News) is Top News Source That Provide Latest and Breaking News in Telugu. Read Andhra Pradesh, Telangana, National and International Telugu News Updates Online. News on Politics, Business, Entertainment, Technology, Sports, Lifestyle and more at startrinethram.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *