Kantara: కాంతార: చాప్టర్ 1.. రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా.. ?

cinema

Kantara: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా చిత్రం “కాంతార: చాప్టర్ 1”. కన్నడ హీరోగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే భారీ హైప్ సృష్టించిన ఈ చిత్రం, గతంలో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన “కాంతార” సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్, డైలాగ్స్ రైటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. అన్ని బాధ్యతలు ఒకేసారి నిర్వర్తించడం ఒక పెద్ద సవాలు అయినా, రిషబ్ విజయవంతంగా మేనేజ్ చేశారని చెప్పవచ్చు.

ఇప్పుడు ఈ చిత్రానికి ఆయన ఎంత పారితోషికం తీసుకుంటారనే చర్చ సాగుతోంది. సినిమా రంగంలో ప్రస్తుతం ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ తీసుకోవడం కంటే, సినిమా కలెక్షన్లలో వాటా తీసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి స్టార్‌లు కూడా సినిమాకు డైరెక్ట్ పారితోషికం కాకుండా, లాభాల్లో భాగం పొందుతున్నారు.

రిషబ్ శెట్టి కూడా అదే విధానాన్ని అనుసరించనున్నారని సమాచారం. సాధారణంగా కన్నడలో చాలా మంది ఆర్టిస్టులు ముందే ఫిక్స్ అయిన పారితోషికం తీసుకుంటారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా నిర్మాతలపైనే భారం పడుతుంది. కానీ “కాంతార: చాప్టర్ 1” కోసం రిషబ్ శెట్టి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని, ఈ సినిమా ద్వారా వచ్చే లాభాల్లో హోంబాలే ఫిల్మ్స్ నుండి వాటా పొందబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ప్రీమియర్ షో అక్టోబర్ 1న జరగనుంది. రిషబ్ శెట్టి సరసన రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య ముఖ్య పాత్రల్లో నటించారు.

Also Read: Viral: మూత్రనాళంలో ఇరుక్కున్న 9 సెంటీమీటర్ల పెన్సిల్

Kantara: కాంతార: చాప్టర్ 1.. రిషబ్ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా.. ?