బాధిత కుటుంబాలకు ఝాన్సీరెడ్డి పరామర్శ
స్టార్ త్రినేత్రం, పాలకుర్తి: కొడకండ్ల మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన ముత్యం వెంకన్న తాటి చెట్టు పైనుండి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డి బుధవారం బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

అనంతరం రామవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీటీసీ పులి సుధాకర్ భార్య ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న ఝాన్సీ రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఇటీవల పెద్దబాయి తండా మాజీ ఎంపీటీసీ, సొసైటీ డైరెక్టర్ , ఫుల్ సింగ్ భార్య రోడ్డు ప్రమాదంలో మరణించారు.
విషయం తెలుసుకున్న ఝాన్సీ రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి, పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కొడకండ్ల మండల అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్, కొడకండ్ల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండలం ముఖ్య నాయకులు ధర్మారపు బిక్షపతి, కీసర సునీల్ రెడ్డి, నూనె ముంతల సోమ నరసయ్య, పసునూరి మధుసూదన్, నర్సింగాపురం గ్రామ పార్టీ అధ్యక్షులు కప్పల రంగయ్య, రామవరం గ్రామ పార్టీ అధ్యక్షులు పెంతల సురేందర్ రెడ్డి, పెద్ద బాయి తండా గ్రామ పార్టీ అధ్యక్షులు బిక్షపతి, పనస శ్రీనివాస్, సీనియర్ నాయకులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: చిన్నారిని ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి
బాధిత కుటుంబాలకు ఝాన్సీరెడ్డి పరామర్శ