Janasena: ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత బలం జనసేనకు ఉందా..?
Janasena: జనసేన.. ఇది ఒక పార్టీ పేరు మాత్రమే కాదు ఓ విప్లవం. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రజాదరణ ఉన్న పార్టీ. గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన పార్టీ. అత్యధిక మెజారిటీతో సీట్లు కొల్లగొట్టిన పార్టీ. మరి ఇలాంటి పార్టీ వ్యూహం ఏంటి? తన వెనుక ఉన్న బలం ఎంత? ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమితో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన జనసేన వచ్చే ఎన్నికల్లో ఎటు వెళ్లాలి అనుకుంటుంది? ఒంటరిగా పోటీ చేసి గెలవగలిగే సత్తా ఉందా? అధినేత పవన్ కళ్యాణ్ దారి ఎటువైపు..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఆ వ్యక్తిని చూసి పార్టీకి ఇంత బలం. మరే నేత అవసరం లేదు అనేంతగా కేవలం జనసేన అంటే పవన్ కళ్యాణ్ అనేలా తన సత్తా చాటి గత ఎన్నికల్లో 100% సక్సెస్ రేట్ ను సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 25 సీట్లకు మాత్రమే పరిమితమైన టిడిపిని తనతో పాటు పోటీ చేయించి 164 స్థానాల్లో గెలిచేలా చేసిన సత్తా ఉన్న అధినేత. ఇక తాజాగా ఒక విషయం హల్చల్ చేసింది. డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ ను నియమించాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టిడిపి అధిష్టానం కన్నెర్ర చేసింది. ఈ విషయంపై ఎవరూ మాట్లాడవద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏది ఏమైనా భవిష్యత్తులో అయినా జనసేనకు ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అలాంటి ఇబ్బంది ఎదురైతే పవన్ కళ్యాణ్ ఒంటరిగా నిలబడి గెలవగలుగుతారా?
నిజమే పవన్ కళ్యాణ్ ఒంటరిగా నిలబడి గెలవగలిగే సత్తా ఉన్న నేత అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశ రాజకీయాలను సాధించగలిగే సత్తా ఉన్నా పవన్ కళ్యాణ్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే లక్షణం ఉన్న అధినేత అంటూ చెప్పుకొస్తున్నారు. ఒకవేళ ఒంటరిగా పోటీ చేయాల్సిన సమయం వస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు పట్టం కడతారని.. తమ అధినేతను సీఎంగా చూడాలని ప్రజలు కలలు కంటున్నారంటూ చెప్పుకొస్తున్నారు. మరి భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం కూడా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తుందనే చెప్పాలి.
ALSO READ: Local body elections: తెలంగాణ స్థానిక పోరు.. గెలిచేదెవరు..!
Janasena: ఒంటరిగా అధికారంలోకి వచ్చేంత బలం జనసేనకు ఉందా..!