Coffee: కాఫీ టేస్ట్ గా లేదని గొడవ.. నెక్ట్స్ రోజే కనిపించకుండా పోయిన భార్యాభర్తలు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్ అనే యువతితో వివాహం అయింది. ఇటీవలే వారు హనీమూన్ కోసం మెఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లారు. ఓ చల్లని సాయంత్రం ఇద్దరూ కలిసి ఒక కాఫీ షాపుకు వెళ్లారు.
Coffee: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్ అనే యువతితో వివాహం అయింది. ఇటీవలే వారు హనీమూన్ కోసం మెఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లారు. ఓ చల్లని సాయంత్రం ఇద్దరూ కలిసి ఒక కాఫీ షాపుకు వెళ్లారు. అక్కడ కాఫీ టేస్ట్ విషయంలో రఘువంశీకి షాపు సిబ్బందితో వాగ్వాదం ఏర్పడింది. ఆ వాగ్వాదం కొట్టుకునే దాకా వెళ్లింది. అయితే ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు నుంచి రఘువంశీ, సోనమ్ ఇద్దరూ గల్లంతయ్యారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
దర్యాప్తులో తీవ్ర విషాదం వెలుగుచూసింది. పోలీసులు రఘువంశీ మృతదేహాన్ని గుర్తించారు. అతడిని కత్తితో కిరాతకంగా హత్య చేసినట్లు స్పష్టం అయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే సోనమ్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈస్ట్ కాశీ హిల్స్ జిల్లా పోలీస్ చీఫ్ వివేక్ సియేమ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఒక కొత్త కత్తిని మేము స్వాధీనం చేసుకున్నాము. అది హత్య కోసం కొన్నట్లుగా అనిపిస్తోంది. ఇది స్పష్టంగా హత్య కేసే. మేము మర్డర్ మరియు ఆధారాలు తుంచే ప్రయత్నం (డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్) కింద కేసులు నమోదు చేశాము. హత్యకు కారణం ఇంకా తెలియాల్సి ఉంది,’’ అని వివరించారు.
రఘువంశీ హత్య వార్తతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రఘువంశీ అన్న మాట్లాడుతూ, ‘‘నా తమ్ముడు హత్యకు గురయ్యాడు. మాకు హోటల్ సిబ్బంది, లోకల్ గైడ్స్, స్కూటర్ రెంటుకు ఇచ్చే వ్యక్తులపై అనుమానం ఉంది. వాళ్లందరినీ విచారించాలి. నా తమ్ముడిని కోల్పోయాను, మరదలిని కోల్పోవాలని అనుకోవటం లేదు. ఆమెను ప్రభుత్వం ఎలా అయినా కనిపెట్టాలి’’ అని విన్నవించారు. రఘువంశీని ఎవరు చంపారు? హత్యకు అసలు కారణం ఏమిటి? సోనమ్ ఎక్కడ ఉంది? కాఫీ షాపులో జరిగిన గొడవ ఈ దారుణానికి మౌలికంగా మారిందా? అన్న ప్రశ్నలు ఇంకా మిస్టరీగానే మిగిలిపోయాయి.
Also Read: Viral: ఫస్ట్ నైట్ రోజే షాకిచ్చిన పెళ్లి కూతురు.. ఆశగా ఎదురుచూసిన వరుడు నిరాశ
Coffee: కాఫీ టేస్ట్ గా లేదని గొడవ.. నెక్ట్స్ రోజే కనిపించకుండా పోయిన భార్యాభర్తలు