భార్య పెదవి కొరికేసిన భర్త.. గాయానికి 16 కుట్లు వేసిన డాక్టర్స్
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సాధారణమే. ఎన్ని గొడవలు అయినప్పటికీ మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి బతకాల్సిందే. కానీ కొందరు కోపంలో మితిమీరి ప్రవర్తిస్తారు. అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ ఎదుటివారిని హింసించే స్థాయికి దిగజారటం సరైన పద్ధతి కాదు కదా.. కానీ ఈ ఘటనలో భర్త మితిమీరి ప్రవర్తించాడు. భార్యతో గొడవపడి ఆమెను తీవ్రంగా గాయపరిచాడు.

ఉత్తర ప్రదేశ్ మధురలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఆమె పెదవని గట్టిగా కొరికేసాడు. దీంతో తీవ్ర రక్తస్రావం అయిన ఆమె ఆసుపత్రికి వెళ్ళగా 16 కుట్లు వేశారు. ఈ ఘటనపై వైద్యులు సైతం నివ్వెరపోయారు. జరిగిన సంఘటనను పోలీసులకు వివరించలేక ఆమె ఓ పేపర్ పై రాసిచ్చింది.
ఇంట్లో పనులు చేస్తుండగా భర్త వచ్చి కారణం లేకుండానే గొడవపడి తనను గాయపరచడని తెలిపింది. గొడవ పెద్దదికావటంతో అప్పటికి శాంతంగా ఉండాలని, గొడవలు ఎందుకని వివరిస్తున్నప్పటికీ వినకుండా ఆమెతో తగాకు దిగాడని.. మితిమీరి ప్రవర్తించి తీవ్రంగా గాయపరిచాడని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మహిళా సంఘాల మండిపడుతున్నాయి. ఇలాంటి కిరాతక భర్తలను కఠినంగా శిక్షించాలని… ఆడవారిని ఇలా హింసించటం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా మగవారు తీరు మార్చుకోవాలని లేదంటే సమాజం గట్టిగా బుద్ధి చెబుతుందని తెలుపుతున్నారు.