Viral News: ఇవన్నీ తిన్న తర్వాత బాలిక కడుపులోంచి బయటపడ్డ పెద్ద జుట్టు ముద్ద
పిల్లలు తినకూడని వస్తువులను తినడం తేలికపాటి అలవాటు అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవానికి ఒక తీవ్రమైన మానసిక సమస్య. వయసుతో సంబంధం లేకుండా కొందరికి మట్టి, సుద్ద, దారం, చెక్క ముక్కలు, జుట్టు వంటి తినరాని వస్తువులను తినే అలవాటు ఏర్పడుతుంది. ఈ అలవాటు వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చు.
Viral News: పిల్లలు తినకూడని వస్తువులను తినడం తేలికపాటి అలవాటు అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవానికి ఒక తీవ్రమైన మానసిక సమస్య. వయసుతో సంబంధం లేకుండా కొందరికి మట్టి, సుద్ద, దారం, చెక్క ముక్కలు, జుట్టు వంటి తినరాని వస్తువులను తినే అలవాటు ఏర్పడుతుంది. ఈ అలవాటు వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తొచ్చు.
జైపూర్‌లోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ సమస్యతో తీవ్రంగా బాధపడింది. కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేర్పించగా, వైద్యులు ఊహించని విషయం గుర్తించారు. విద్యార్థిని కడుపులో 210 సెంటీమీటర్ల పొడవైన వెంట్రుకల బంతి (ట్రైకోబెజోవర్) ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ట్రైకోబెజోవర్‌గా వైద్యులు ప్రకటించారు.
విద్యార్థికి నిర్వహించిన CE CT స్కాన్‌లో, కడుపు ఉబ్బినట్లు, లోపల ఏదో అసాధారణ వస్తువు ఉన్నట్లు కనిపించింది. వెంటనే వైద్యులు లాపరోటమీ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ ఆపరేషన్ ప్రత్యేకత ఏమిటంటే.. రక్త మార్పిడి అవసరం లేకుండానే, కేవలం రెండు గంటల్లో అత్యంత క్లిష్టమైన ట్రైకోబెజోవర్ను తొలగించగలిగారు.
గ్యాస్ట్రోస్టమీ సమయంలో వైద్యులు గమనించిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, వెంట్రుకల బంతి కేవలం కడుపులోనే కాకుండా, చిన్న ప్రేగుల వరకూ వ్యాపించింది. ఈ వెంట్రుకల ముద్దను కట్ చేయకుండా ఒక్క ముక్కగా బయటకు తీయడం వైద్యులకు చాలా పెద్ద సవాలుగా మారింది. అది చెక్కితే ప్రేగులు కట్ చేయాల్సిన అవసరం ఏర్పడేదని వైద్యులు తెలిపారు. అయినా రెండు గంటల పాటు శ్రమించి, ఎక్కడా చెక్కకుండా ముద్దను పూర్తిగా తొలగించారు.
ఈ శస్త్రచికిత్సలో ప్రముఖ గాస్ట్రో సర్జన్ డాక్టర్ జీవన్ కంకారియా నేతృత్వంలోని బృందం పాల్గొంది. ఈ బృందంలో:
- డా. రాజేంద్ర బుగాలియా
- డా. దేవేంద్ర సైని
- డా. అమిత్
- డా. సునీల్ చౌహాన్
- అనస్థీషియా బృందం
- సహాయకులు షయీర్, జుగన్
ఈ శస్త్రచికిత్స విజయవంతమైందని, విద్యార్థిని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇకపోతే డాక్టర్ జీవన్ కంకారియా వెల్లడించిన వివరాల ప్రకారం, విద్యార్థి ఒక పికా (Pica) అనే మానసిక సమస్యతో బాధపడుతోంది. ఈ సమస్య కారణంగా ఆమె:
- బంకమట్టి
- సుద్ద ముక్కలు
- దారం
- చెక్క ముక్కలు
- జుట్టు
ఇలాంటి అనారోగ్యకరమైన వస్తువులను తినడం అలవాటు చేసుకుంది. ఇవన్నీ క్రమంగా ఆమె కడుపులో పేరుకుపోయి, పెద్ద ముద్దగా మారాయి. దాంతో కడుపు ఉబ్బడం, నొప్పి, వాంతులు వంటి సమస్యలు మొదలయ్యాయి.
Also Read: Rare Surgery: ఆడుకుంటుండగా మెడ నుంచి మెదడులోకి దూసుకెళ్లిన మేకు.. ఆ తర్వాతేమైందంటే..
Viral News: ఇవన్నీ తిన్న తర్వాత బాలిక కడుపులోంచి బయటపడ్డ పెద్ద జుట్టు ముద్ద