విద్యార్థిని క్లాస్‌లోనే పెళ్లి చేసుకున్న మహిళ టీచర్.. ఆపై..!
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే గాడి తప్పి ప్రవర్తిస్తున్నారు. పద్ధతులు నేర్పాల్సిన వారే పద్ధతి తప్పుతున్నారు. ఉపాధ్యాయులు ఆ పేరుకే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరగగా.. తాజాగా బెంగాల్లో జరిగిన మరో సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మన సమాజం ఎటు పోతుందా అనే ఆలోచనను రేకెత్తించింది. అసలు ఏం జరిగిందంటే..

పశ్చిమ బెంగాల్లోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీలో ఓ లేడీ ప్రొఫెసర్ ఘనకార్యం ఇప్పుడు అందర్నీ నివ్వెపోయేలా చేస్తుంది. ఓ విద్యార్ధిని క్లాస్ రూమ్ లోనే ఈ లేడీ ప్రొఫెసర్ పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మండిపడింది. డిపార్ట్మెంట్ హెడ్ గా ఉన్న ఆ ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసింది. ఆ విద్యార్థిని స్కూల్ నుంచి పంపించేసింది. ఇక ఇంత జరిగిన తర్వాత ఆ లేడీ ప్రొఫెసర్ మాట మార్చేసింది. అప్లైడ్ సైకాలజీ ప్రాజెక్ట్ లో భాగంగా మాత్రమే ఈ ఘటన నిర్వహించామని తెలిపింది. అయితే ఇది ఎంతవరకు నిజమనే విషయంపై యాజమాన్యం విచారణ చేపట్టింది.
ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు సమాజాన్ని చెడుదారి పట్టిస్తాయని సోషల్ మీడియా యూజర్స్ కామెంట్లు పెడుతున్నారు. విద్యాబుద్ధులను నేర్పాల్సిన ఉపాధ్యాయుల మితిమీరి ప్రవర్తిస్తే సమాజం చెడుదారి పడుతుందని.. ఇందులో సైకాలజీ అప్లై చేయడం ఇంకా ఎక్కడ ఉందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.