Excellent driving: శారీరక లోపాలు ఉన్నా మనసు దృఢంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదని మరోసారి నిరూపించిన ఘటన ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి రెండు చేతులు లేకుండానే బైక్‌ను అద్భుతంగా నడుపుతూ కనిపించాడు. అతను ఓ బైక్‌పై సమతుల్యతను అద్భుతంగా కాపాడుతూ స్పీడ్‌గా నడిపిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దూరం నుండి చూస్తే సాధారణ రైడర్‌లాగా అనిపించినా, దగ్గరగా చూసినప్పుడు అతనికి చేతులు లేవని గ్రహించి అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ ప్రేరణాత్మక వీడియోను ట్విట్టర్‌లో @Digital_khan01 అనే యూజర్ షేర్ చేశారు. “చేతులు లేని ఈ వ్యక్తి చూపించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం మాటల్లో చెప్పలేనిది. బుల్లెట్ వేగంతో బైక్ నడపడం అతని ఆత్మస్థైర్యానికి నిదర్శనం. ఇంత అద్భుతమైన వీడియో ఎప్పుడైనా చూశారా?” అంటూ అతను పేర్కొన్నాడు. శరీర పరిమితులు మనసు ధైర్యాన్ని అడ్డుకోలేవని ఇలాంటి వీడియోలు మన ఒక స్పష్టమైన సందేశం ఇస్తాయి.
ALSO READ: Viral video: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ప్రేమ జంట రొమాన్స్
Excellent driving: రెండు చేతులు లేకున్నా బైక్‌ను రఫ్పాడిస్తున్నాడు..!


