Dog Bite: దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య ప్రతిరోజూ తీవ్రమవుతోంది. కుక్క కాటు కారణంగా రేబిస్ (Rabies) వంటి ప్రాణహానికర వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. సరైన సమయంలో వైద్య చికిత్స తీసుకోకపోతే, చిన్న గాయం కూడా ప్రాణాలను తీసివేయగలదు. అందువలన కుక్క కాటుకు ఎప్పుడు, ఎలా, ఏ విధంగా చికిత్స అవసరమో తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు.
కుక్క కాటుకు మూడు దశల చికిత్స:
మొదటి దశ: ఈ దశలో గాయాలు సాధారణంగా చర్మంపై మాత్రమే ఉంటాయి. చాలామంది చిన్న గాయాల కోసం పసుపు, కారం వంటి ఇంటి చిట్కాలను ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ (infection) పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాయాన్ని కనీసం 5-10 నిమిషాలు శుభ్రమైన నీటితో శుభ్రం చేసి, ఆపై యాంటీసెప్టిక్ క్రీమ్ ఉపయోగించడం మంచిది.
రెండో, మూడో దశలు: ఈ దశల్లో గాయాలు లోపలికి లేదా మాంసం బయటకు వస్తాయి. ఈ సందర్భాల్లో పోస్ట్-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ (PEP) చికిత్స తప్పనిసరి. గాయాన్ని శుభ్రం చేసిన తర్వాత రేబిస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వ్యాధి వ్యాప్తిని ఆపవచ్చు. గాయాన్ని పోవిడోన్-అయోడిన్ ద్రావణంతో శుభ్రం చేసి, ఆపై బెటాడిన్ వంటి యాంటీసెప్టిక్ మందులు వాడడం మంచిదట.
టెటనస్ జాగ్రత్తలు: రెండో, మూడో దశల్లో గాయం తీవ్రంగా ఉంటే టెటనస్ ఇంజెక్షన్ అవసరం. మాంసం బయటకు వచ్చినప్పుడు కేవలం కుట్లు వేయడం ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకు బదులుగా, యాంటీబయోటిక్ మందులు ఉపయోగించడం అత్యంత అవసరం.
ఇంజెక్షన్ షెడ్యూల్: PEP చికిత్సలో ఐదు డోసులు ఉంటాయి.
మొదటి డోస్: కుక్క కరిచిన రోజున
రెండో డోస్: 3వ రోజు
మూడో డోస్: 7వ రోజు
నాల్గో డోస్: 21వ రోజు
ఐదో డోస్: అవసరమైతే 28వ రోజు
అందువలన కుక్క కరిచిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం, దశలవారీగా సరైన చికిత్సను తీసుకోవడం ద్వారా రేబిస్, ఇన్ఫెక్షన్ వంటి ప్రాణహానికర వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. సమయానికి తీసుకున్న వైద్య చర్య ప్రాణాలను కాపాడే అత్యంత కీలకమైన మార్గం.
ALSO READ: Janhvi Kapoor: ‘పరమ్ సుందరి’ ట్రోల్స్‌పై జాన్వీ కపూర్ స్పందన
Dog Bite: కుక్క కరిచిన వెంటనే ఏంచేయాలో తెలుసా?


