Bhu Bharathi Portal: భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేయాలంటే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రక్రియ భూభారతి పోర్టల్. ఈ పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 14న శిల్ప కళా వేదికలో అధికారికంగా ప్రారంభించారు.
Bhu Bharathi Portal: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రక్రియ భూభారతి పోర్టల్. ఈ పోర్టల్ ను సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 14న శిల్ప కళా వేదికలో అధికారికంగా ప్రారంభించారు. అయితే ఇందులో ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేసుకోవాలి, అందులో ఏమేం ఆప్షన్స్, ఫీచర్స్ ఉంటాయి అన్న విషయాలు చాలా మందికి కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు. కానీ ఈ ఆన్లైన్ సిస్టంతో మీరు మీ భూ రికార్డులను తనిఖీ చేసుకోవడం అనేది సులభతం. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
భూమి రికార్డుల డిజిటలైజేషన్ భూభారతి పోర్టల్ ద్వారా సులభతరం అవుతుంది ముఖ్యంగా భూమికి సంబంధించిన రికార్డులన్నింటినీ డిజిటల్ రూపంలో భూ యజమానుల వివరాలను సైతం తెలుసుకునే అవకాశం ఈ పోర్టల్ ద్వారా కలుగుతుంది.
జీపీఎస్ ఆధారిత సర్వే నిర్వహించడం ద్వారా భూముల సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించే అవకాశం కలుగుతుంది. తద్వారా భూముల వివాదాలను తగ్గించే వీలు ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది కానీ భూభరతి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేసుకోవాలన్న విషయానికొస్తే..
1: ముందుగా భూభారతి కి సంబంధించిన అధికారిక వెబ్ సైట్లోకి వెళ్ళండి.
భూభారతి పోర్టల్ అధికారిక వెబ్‌సైట్ ఇదే.
https://bhubharati.telangana.gov.in
2: ఇప్పుడు సైట్ ఓపెన్ అయిన అనంతరం. మీకు అందులో హోమ్‌పేజ్ లో Land Details ఆప్షన్ కనిపిస్తుంది. దీనిని క్లిక్ చేయాలి.
3: Land Details ఆప్షన్ క్లిక్ చేసిన అనంతరం మీ భూమి ఎక్కడ ఉందో ఆ జిల్లా, మండలం, గ్రామం ఎంచుకోవాలి. లేదంటే Pattadar Passbook Number ఎంటర్ చేయడం ద్వారా కూడా మీ లాండ్ రికార్డ్స్ వివరాలు తెలుసుకోవచ్చు.
4: ఇప్పుడు మీ పట్టా నంబర్ లేదా సర్వే నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయవచ్చు.
మీ దగ్గర ఉన్న భూమి వివరాల ప్రకారం మీకు అనుకూలమైన ఆప్షన్ ఎంచుకుని, వివరాలు నమోదు చేయండి.
5: మీరు అందజేసిన వివరాల మేరకు మీకు సమాచారం లభిస్తుంది.
భూమి వివరాల్లో – యజమాని పేరు, భూమి పరిమాణం, లొకేషన్ (Village, Mandal, District), భూధార్ నంబర్, రిజిస్ట్రేషన్ వివరాలు, మ్యూటేషన్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. మీరు దీనిని ప్రింట్ చేసుకోవచ్చు.
ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే.. భూభారతి ప్రస్తుతం నాలుగు మండలాల్లో మాత్రమే పైలెట్ ప్రాజెక్టుగా అమలు అవుతోంది. కనక పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చిన అనంతరం మీకు వివరాలు కనిపించే అవకాశం ఉంది.
Also Read : PM Modi: తన కోసం 14 ఏళ్లు చెప్పులు వేసుకోకుండా ఉన్న వ్యక్తికి.. స్వయంగా బూట్లు తొడిగిన మోదీ
Bhu Bharathi Portal: భూభారతి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ ఎలా చెక్ చేయాలంటే..